మళ్లీ రేసులోకి రావడానికి పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈమధ్యే `రీ సౌండ్` అనే సినిమాని పట్టాలెక్కించాడు. టైటిల్ మాసీగా ఉంది. బంపర్ ఆఫర్ తరవాత మరో మంచి క్యాచీ టైటిల్ అనిపించుకుంది. ఇప్పుడు రెగ్యులర్‌గా సినిమా చేయాలని సాయిరామ్ శంకర్ భావిస్తున్నాడు. అందుకే నిర్మాతగానూ మారబోతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ స్థాపించి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కొంతమంది మిత్రుల్ని కూడా భాగస్వాములుగా చేస్తున్నాడు. జనవరిలో ఈ చిత్రాన్ని ప్రకటిస్తారు. ఎప్పటిలానే ఓ కొత్త దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నాడు. రీ సౌండ్‌తో పాటు ఈ సినిమా కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకి పూరి కథ అందించే అవకాశం ఉంది.