పూరి జగన్నాథ్ ఎన్ని ఫ్లాపులు తీసినా, మళ్లీ మళ్లీ నమ్మబుద్ది వేస్తుంటుంది. ఎందుంకంటే.. తన స్టామినా అలాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగైనా సరే.. తన ఉనికిని, తన టాలెంట్‌నీ చాటుకొనే ఏ ఒక్క అవకాశాన్నీ వృథాగా వదులుకోడు పూరి. తనదైన రోజున బాక్సాఫీసు షేక్ చేసే అద్భుతాలు సృష్టించగల సమర్థుడు. అందుకే పూరిని స్టార్ హీరోలు ఇప్పటికీ నమ్ముతుంటారు. తాను కూడా.. వాళ్ల కోసం తగిన కథల్ని సిద్దం చేసుకొంటుంటాడు. తాజాగా పూరి దృష్టి నందమూరి బాలకృష్ణపై పడిందని టాక్. ఈమధ్య బాలకృష్ణ వర్మ సెట్లోకి వెళ్లి అమితాబ్‌ని కలుసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే బాలయ్య, వర్మల మధ్య ఓ చిన్న చర్చ సాగిందట. ఇద్దరూ కలసి కాసేపు ముచ్చటించుకొన్నారని తెలుస్తోంది.
”మీ కోసం ఓ కథ రెడీ చేశా. వినిపించాలని వుంది” అని పూరి తన మనసులోని మాట బయపెట్టాడట. దానికి బాలయ్య కూడా ”సరే… వినిపించండి.. తీరిగ్గా ఎప్పుడైనా కూర్చుందాం” అని చెప్పాడట. సో.. పూరి బాలయ్యకు కథ వినిపించడం ఖాయం. బాలయ్య పద్ధతి వేరుగా ఉంటుంది. హిట్, ఫ్లాప్ రికార్డుల్ని పట్టించుకోడు. కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తాడు. నిజంగా పూరి మంచి కథ చెబితే.. బాలయ్యకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవొచ్చు. అయితే మంచి కథ చెప్పి, ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం కచ్చితంగా పూరిదే. బాలయ్య వందో సినిమా కోసం తగిన కథని వెదుకుతున్నప్పుడు సైతం పూరి ట్రై చేశాడు. కానీ అప్పుడు బాలయ్యని కలుసుకోవడం కుదర్లేదు. ఆలోగానే గౌతమి పుత్ర ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో.. ఇప్పుడైనా పూరి ఆలస్యం చేయకుండా కథ వినిపించేస్తే సరి.