డేరింగ్ డాషింగ్ హీరోలు ఉంటారు కాని అలాంటి కట్ అవుట్స్ ఉన్న దర్శకుడు మాత్రం ఒక్క తెలుగు పరిశ్రమలోనే ఉంటాడు ఆయనే పూరి జగన్నాథ్. సినిమాల టైటిల్స్ తోనే ప్రేక్షకులని తన సినిమా మీద ఓ అటెన్షన్ ఏర్పడేలా చేసే ఈ దర్శకుడు ఈమధ్య కాస్త మారిపోయాడని అంటున్నారు. పూరి పెన్నుకు స్పీడ్ ఎక్కువ అందుకే హీరో ఎవరైనా సరే మూడు నెలల్లో సినిమా తీసి చేతిలో పెడతాడు. అలానే స్టార్ హీరోల సినిమాలు చేసి చూపించాడు. ఓ పక్క అప్ కమింగ్ హీరోల సినిమాలను చేస్తూనే మరో పక్క పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేస్తున్నాడు పూరి. అయితే ఈ మధ్య పెద్ద హీరోల ఇచ్చిన షాక్ కి దెబ్బతిన్న పూరి రూటు మార్చి కుర్ర హీరోల వెంటబడ్డాడు. అంతేకాదు పెద్ద హీరోల సినిమా కోసం తిరిగి ఒళ్ళు హూనం చేసుకోనని అంటున్నాడు కూడా. అయితే పూరి మాటల్లోని అంతరార్ధం మాత్రం మెగాస్టార్ సినిమా కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఈ మాటలంటున్నాడేమో అనుకుంటున్నారంతా..
దిమ్మతిరిగే ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే పూరి మెగాస్టార్ ఆటోజాని కథ చెప్పడం. ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ బాలేదని అనడం తెలిసిందే. కాని సెకండ్ ఆఫ్ బాగాలేదని తనతో చెప్పలేదని బాధపడుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. చిరంజీవి గారు తనతో సెకండ్ ఆఫ్ లో ఏం బాగాలేదని చెబితే దాన్ని మార్చే వాడినని అంటున్నాడు పూరి. మొత్తానికి ఇంకా చిరు సినిమా మిస్ అయినందుకు పూరి బాధపడుతున్నాడనే తెలుస్తుంది. ఆ బాధతోనే పెద్ద హీరోల సినిమాల కోసం తిరిగి ఒళ్ళు హూనం చేసుకోలేను అని అంటున్నాడని అనుకుంటున్నారు. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేస్తున్నాడు పూరి. బాహుబలి సినిమా గురించి ఆ సినిమా గొప్పతనం గురించి అందరు అన్ని విధాలుగా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయ్. కాని పూరి మాత్రం వీరందరికి డిఫరెంట్ గా కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు పూరి జగన్నాథ్. ఇక బాహుబలి లాంటి సినిమా తెలుగులో రావడం చాలా గొప్ప విషయమని చెబుతూ అలాంటి సినిమాలు తాను చేయనని కావాలంటే 100 రూపాయలు పెట్టి చూస్తా అని అన్నాడు. అంటే అలాంటి సినిమా చేసే ఓపిక లేదన్నట్టుగా సమాధానమిచ్చాడు పూరి. అయితే ఈ వార్త తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరికి బాహుబలి లాంటి సినిమా తీసే సత్తా లేదా అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
పూరి సినిమాలన్ని హాట్ కేకులే.. ఇలా సినిమా ఓపెనింగ్ చేస్తూ అలా రిలీజ్ డేట్ చెప్పేస్తాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే మాక్సిమం మూడు నెలల కంటె ఏ సినిమాను ఎక్కువ పొడిగించడు. సినిమాను షూటింగ్ అంటూ మురగపెట్టడం పూరికి నచ్చని పని. అందుకే పూరి సినిమాలు కాస్త అటు ఇటు అయినా నిర్మాతలకు ఎక్కువ లాస్ తెచ్చిపెట్టవు. మరి అలాంటి డ్యాషింగ్ డైరక్టర్ పూరి బాహుబలి లాంటి సినిమాలు చేయను చూస్తా అనడంలో అర్ధం ఏంటో కాస్త మెదడుకు పదును పెట్టి ఆలోచించాల్సిందే.