ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా… మరో సినిమా వచ్చేసరికి అటెన్షన్ పెంచుకోవడం కేవలం పూరి జగన్నాథ్ లాంటి దర్శకులకే సాధ్యం. ఎందుకంటే… పూరి స్టామినా ఏంటో జనాలకు బాగా తెలుసు. ఎప్పుడో సారి జనాలకు దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే స్ట్రోక్ ఇవ్వగల సమర్థుడు పూరి. అందుకే పూరి సినిమాల్ని ఛీదరించుకొంటూనే ప్రేమించేస్తుంటాం. `ఈసాసారైనా మరో ఇడియట్ రాకపోతుందా` అని. అలాంటి మరో ఇడియట్‌ని రంగంలోకి దించడానికి భారీ ఎత్తున స్కెచ్ వేశాడు. `రోగ్` సినిమాతో. నిజానికి రోగ్‌పై ఇప్పటి వరకూ ఎవ్వరికీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్లూ లేవు. పూరి నుంచి మరో సినిమా వస్తోందంతే.. అనుకొన్నారు. దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి.. పూరి వరుస ఫ్లాపుల్లో ఉండడం, రెండోది ఓ అనామకుడ్ని హీరోని చేయడం.
అయితే.. ఒకే ఒక్క పోస్టర్‌తో మరోసారి అటెన్షన్ అంతా తనపై ఫోకస్ అయ్యేలా చేసుకొన్నాడు పూరి. రోగ్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. పోస్టర్ చూస్తే.. రివర్స్‌లో వేలాడుతున్న హీరో కనిపించాడు. టైటిల్ కింద.. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. చంటిగాడు అంటే మనకు ఇడియట్లో రవితేజనే గుర్తొస్తాడు. రవితేజని స్టార్‌ని చేసిన సినిమా అది. పూరి స్టామినా అమాంతం పెంచేసిన సినిమా అది. అందుకే.. ఇడియట్ ఫార్ములానే మరోసారి పూరి నమ్ముకొన్నాడు. పోస్టర్‌తోనే అందర్నీ తనవైపుకు తిప్పుకొన్నాడు. పోస్టర్ రివర్స్ చేయడం మంచి ఐడియానే. కాకపోతే… రిజల్ట్ మాత్రం రివర్స్ అవ్వకూడదు. అయ్యిందా… ఇక పూరి పని గోవిందా. ఆ ప్రమాదం రాకూడదంటే.. పోస్టర్లో కనిపించిన క్రియేటివిటీ సినిమాలోనూ కనిపించాలి. మరి పూరి ఆ మ్యాజిక్ చేయగలడా?? వెయిట్ అండ్ సీ.