మెగాస్టార్ 150వ సినిమా ఎప్పుడు అన్నది ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. మొన్నటిదాకా కత్తి రీమేక్ కోసం ప్రయత్నాలు చేసేందుకు హడావిడి చేసిన చిరు దాన్ని కూడా విరమించుకున్నాడు. ఇక అఖిల్ పుణ్యమాని వినాయక్ ని కూడా చిరు సినిమా నుండి అవుట్ అనేశాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మెగా కాంపౌండ్ కి ఏకైక ఆప్షన్ పూరి జగన్నాథ్.. ఆల్రెడీ చిరు 150వ సినిమా కోసం పూరి ఓ కథ రెడీ చేయడం చిరుకి చెప్పడం మొదటి భాగం నచ్చింది కాని మిగతా సగం మీద వర్క్ చేయడమనడం జరిగింది.
అయితే జ్యోతిలక్ష్మి, టెంపర్ రెండు యావరేజ్ లుగా మిగిలేసరికి పూరి మీద నమ్మకం కుదరక అరవ కథనే వినాయక్ చేత చేయిద్దామనుకునాడు మెగాస్టార్. ఇక అఖిల్ సినిమాతో డైరక్టర్ వినాయక్ ఫెయిల్ అయ్యాడని అతన్ని కూడా చిరు తీసేశాడని అంటున్నారు. అయితే ఈ టైంలోనే మళ్లీ పూరికి మెగా కాంపౌండ్ నుండి పిలుపొచ్చిందని తెలుస్తుంది. చూస్తుంటే చిరుతో సినిమా తీయాలనే పూరి కల నెరవేరబోతుందని అనిపిస్తుంది.
ఆటోజానిగా చిరు కోసం పూరి రాసిన కథ సెకండ్ ఆఫ్ మళ్లీ చేంజ్ చేసి చిరుకి వినిపించే ప్రయత్నం చేస్తున్నాడట పూరి. మరి లక్ బాగుండి పూరి చెప్పిన సెకండ్ ఆఫ్ కూడా నచ్చితే మెగాస్టార్ 150వ సినిమా పట్టాలెక్కేసినట్టే. ఇక సినిమా డైరక్టర్ పూరి అయితే సినిమా మూడు నెలల్లో తీసేసి రిలీజ్ కూడా చేసేస్తాడు.