ఎలాంటి సినిమా తీసినా.. దానికి అదిరిపోయే పేరు పెట్టడం పూరి జగన్నాథ్‌కి అలవాటు. మొదట పూరి టైటిళ్లలో క్రియేటివిటీ కనిపించేది. మెల్లమెల్లగా తిట్లకు అలవాటైపోయాడు. దాంతోనూ హిట్లు కొట్టడంతో చివరికి అదే కంటిన్యూ చేసేశాడు. సినిమా మొదలెట్టక మునుపే టైటిల్ చెప్పేయడం పూరికి అలవాటు. అయితే బాలకృష్ణతో సినిమా మొదలెట్టి ఇన్ని రోజులైనా టైటిల్ ఏంటో చెప్పడం లేదు. ‘ఉస్తాద్’ అనే టైటిల్ ఫిక్సయిపోయింది.. అని చెబుతున్నా – ఆ టైటిల్‌తో బాలయ్య శాటిస్పై అవ్వలేదని టాక్. దాంతో పూరి పవర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నాడట. చిటికెలో కథ అల్లేసే పూరి.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విషయంలో గింగిరాలు తిరిగిపోతున్నట్టు సమాచారం.
కొత్త హీరో అయితే… మరో తిట్టుని టైటిల్లా పెట్టేసేవాడేమో. అక్కడున్నది నందమూరి బాలకృష్ణ. అందుకే.. ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా, బాలయ్య ఇమేజ్ కి తగినట్టుగా టైటిల్ ఉండాలని భావిస్తున్నాడు. టైటిల్ విషయంలో తొందరపడకుండా.. మంచి టైటిల్ కోసం ఇంకా తన అన్వేషణ కొనసాగిస్తున్నాడట. తన అసిస్టెంట్ డైరెక్టర్లని కూడా ‘మంచి టైటిల్ ఉంటే చెప్పండి.. కథకు మ్యాచ్ అవ్వకపోయినా ఫర్వాలేదు’ అంటూ సలహాలు అడుగుతున్నాడట. పూరికే టైటిళ్లకు కొరత వచ్చేసిందంటే, మిగిలిన వాళ్ల మాటేంటో??