పూరి సినిమా.. ‘రోగ్’తో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు ఇషాన్. మంచి హైటు, పర్సనాలిటీ ఉన్న ఇషాన్ నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నా, ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇక కనిపించలేదు. ఇప్పుడు చాలాకాలం తరవాత మళ్లీ తెరపైకి వస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో రవితేజ కథానాయకుడిగా నటిస్తారు. వల్లూరిపల్లి రమేష్ నిర్మాత. ఈ సినిమాలో ఇషాన్‌కి ఓ మంచి పాత్ర దక్కిందని తెలుస్తోంది. ఇందులో ఇషాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్రలకు ఇషాన్ బాగానే ఉంటాడు. ఈమధ్య హీరోలంతా.. యంగ్ విలన్లపై దృష్టిసారించారు. ఆది పినిశెట్టి లాంటి వాళ్లకు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇషాన్ ని కూడా విలన్‌గా రంగ ప్రవేశం చేయించబోతున్నారన్నమాట. రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’తో బిజీగా ఉన్నాడు. మరి ‘మహా సముద్రం’ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.