తెలుగు రాష్ట్రాల్లో మీడియా, సోషల్ మీడియా దృష్టి ఒక్కసారి మారిపోయింది. మొన్నటి వరకూ పుష్ప-రప్పా రప్పా పోస్టులు ట్రెండింగ్ లో వున్నాయి. స్క్రోల్స్ చేస్తే పుష్ప న్యూసే కనిపించిందే. అయితే సడన్ గా సీన్ లోకి మోహన్ బాబు కుటుంబ వివాదం, నాగబాబుకి మంత్రి పదవి ఎంటరయ్యాయి.
ఇందులో మొదటి స్థానంలో మోహన్ బాబు కుటుంబ వివాదం వుంది. మోహన్ బాబు, చిన్న కుమారుడు మనోజ్ కి మధ్య ఎప్పటినుంచో మనస్పర్ధలు వున్నాయి. మనోజ్ రెండో పెళ్లి వారి మధ్య మరింత దూరం పెంచింది. కుటుంబ కలహాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు, మీడియాపై మోహన్ బాబు దాడి.,. ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ మారి మీడియా స్పెస్ ని అక్రమించాయి.
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తున్నారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు…ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. నాగబాబుకి ఏ శాఖని కేటాయిస్తారనేది పై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే నాగబాబు అంటే గిట్టనివారు గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్, వీడియోస్ ని బయటికి తీసి సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులని రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ న్యూస్ ట్రెండ్ లో నాగబాబు మంత్రి పదవి రెండో స్థానం.
మొన్నటి వరకూ టాప్ ట్రెండింగ్ లో వున్న పుష్ప ఇప్పుడు మూడో స్థానంలోకి వెళ్ళింది. పుష్ప క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ చాలానే వున్నాయి. అయితే మోహన్ బాబు, నాగబాబు టాపిక్స్ మధ్య వాటికి మీడియా స్పెస్ అంతగా దొరకడం లేదు. పుష్ప టీం సక్సెస్ టూర్ ని ప్లాన్ చేస్తోంది. దాంతో మళ్ళీ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ వుంది.