పుష్షకి లీకులతో సమస్య వచ్చి పడింది. మొన్నటికి మొన్న `దాక్కో దాక్కో మేక` రిలీజ్‌కి ముందే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాలోంచి ఓ చిన్న యాక్షన్ బిట్ బయటకు వచ్చింది. ఓ పెళ్లిమండపంలో అల్లు అర్జున్ ఫైట్ చేసే సీన్ అది. రేకుల కుర్చీని మెడపై పెట్టుకుని రౌడీల్ని చితక్కొడుతుంటాడు. ఈ సీన్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. వీఎఫ్ఎక్స్ చేస్తున్నప్పుడే ఈ షాట్ లీకైందని సమాచారం. ఆ సమయంలో…. అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ సెల్ ఫోన్ నుంచే ఈ సీన్ లీకైందని భావిస్తున్నారు. అయితే ఆ సహాయ దర్శకుడు మాత్రం నాకేం తెలిదని బుకాయిస్తున్నాడట. దాంతో ఈ షాట్ ఎలా లీకైందన్న విషయంలో నిర్మాతలు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మైత్రీ మూవీస్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడొచ్చింది చిన్న షాటే. అందులోనూ క్లారిటీ లేదు. భవిష్యత్తులో కీలకమైన సన్నివేశాలో, పాటలో బయటకు వచ్చేస్తే.. పుష్షకి పెద్ద సమస్యే. పుష్ష అనే కాదు.. మిగిలిన పెద్ద సినిమాలూ ఇలాంటి లీకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే – చాలా నష్టాన్ని భరించాల్సివస్తుంది.