‘పుష్ప’ సినిమా నటుడిగా అల్లు అర్జున్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా హిందీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది. ఇప్పటికే పుష్ప సినిమా పై బోలెడు రీల్స్ వచ్చాయి. టీం ఇండియా ఆటగాళ్ళు పుష్ప ని అనుకరిస్తూ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి. అయితే తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ అధికారిక పేస్ బుక్ ఖాతాలో పుష్ప పోస్టర్ ని పోస్ట్ చేశారు. ”తగ్గేదిలే” స్టిల్ ని పోస్ట్ చేస్తూ కరోనా నిమంత్రణ ప్రచారంలో ఉపయోగించారు.”డెల్టా లేదా ఒమిక్రాన్ .. ఏదైనా సరే నేను మాత్రం మాస్క్ తీసేది లేదు”అనే టైటిల్ జత చేశారు. కరోనా మూడో దశ విజ్రుంభిస్తున్న సంగతి తెలిసిందే. వేలల్లో వున్న కేసులు ఇప్పుడు లక్షల్లో నమోదౌతున్నాయి. కరోనాని నియంత్రించే మార్గల్లో మాస్క్ వాడకం తప్పనిసరి. ఈ నేపధ్యంలో బన్నీ పుష్ప పోస్టర్ ని వాడుకుంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం విశేషమనే చెప్పాలి.