పుష్ప రష్యాలో రిలీజ్ అవుతోంది. ఈరోజే.. అక్కడ విడుదల. రష్యాలో ఓ తెలుగు సినిమా ఇంత భారీ ఎత్తున విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా ప్రచారం కోసం బన్నీ, సుకుమార్, అండ్ టీమ్… రష్యా వెళ్లింది. ప్రచారం చేసొచ్చింది. ఇక ఫలితం రావాల్సివుంది. అయితే ఈ ప్రచారం కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. ఓ తెలుగు సినిమాని విదేశాల్లో ప్రచారం చేసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే.. రూ.5 కోట్లనేది చాలా ఎక్కువన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే రష్యాలో తెలుగు సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. కనీసం ప్రచారం కోసం పెట్టిన డబ్బు తిరిగి వచ్చినా గొప్పే. నిజానికి రూ.2, లేదా 3 కోట్లలో ఈ ప్రచారం ముగించాలి అనుకొన్నారు. కాకపోతే… బన్నీ టీమ్ నుంచి ఎక్కువమంది సభ్యులు రష్యా పయనం అవ్వడంతో బడ్జెట్ దాటేసింది. `పుష్ప` ఆడితే.. తెలుగు సినిమాకి అక్కడో మార్కెట్ దొరికినట్టే. ఆర్.ఆర్.ఆర్ టీమ్ జపాన్ వెళ్లింది. అక్కడ సినిమా కోసం బాగా ప్రచారం చేసుకొన్నారు. ఫలితం కూడా చూశారు. అదే.. విధంగా పుష్ప కీ.. రష్యాలో మైలేజీ వస్తే బాగానే ఉంటుంది.