‘పుష్ప: ది రూల్’ నిన్నటి బెనిఫిట్ షోలతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ జాతర అనే రెస్పాన్స్ ఆడియన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బన్నీ మాస్ యాక్షన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త ఎడముఖంగా వున్నారని వినిపిస్తోంది. కొన్నాళ్ళుగా బన్నీతో పాటు అల్లు ఆర్మీ ప్రవర్తిస్తున్న తీరు మెగా అభిమానులకు రుచించడం లేదనేది వాస్తవం. ఉభయ గోదావరి జిల్లాలు మెగా అభిమాన సంఘాలు పుష్ప 2కి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా వినిపిస్తోంది.
ఇలాంటి సందర్భంలో పుష్ప చిత్ర బృందం తాజాగా చిరంజీవిని కలిసింది. దర్శకుడు సుకుమార్, మైత్రీ నిర్మాతలు నవీన్, రవి, సీఈవో చెర్రీలు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నామని మీడియాకి ఫోటోలు వదిలారు. అంతా బావుంది కానీ ఈ టీంలో మెయిన్ క్యారెక్టర్ పుష్పరాజే మిస్ అయ్యాడు. నిజానికి ఆ టీంతో పాటు బన్నీ కూడా వెళ్లి మెగా ఆశీస్సులు తీసుకుని వుంటే బావుండేది. ఆ ఫ్రేంలో అల్లు అర్జున్ మిస్ అవ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశగా మారింది.