వేర్ ఈజ్ పుష్ప.. అంటూ సుకుమార్ అండ్ టీమ్ ఓ గ్లిమ్స్ వదిలింది. ఏప్రిల్ 7న అంటే రేపు సాయింత్రం 4 గంటలకు పుష్ప 2 నుంచి ఓ సర్ప్రైజ్ రాబోతోందని హింట్ ఇచ్చారు. ఈ అప్డేట్ ఏమిటా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఫ్యాన్స్ కోసం పెద్ద గిఫ్టే ప్లాన్ చేశాడు. ఓ ట్రైలర్ లాంటి టీజర్‌ని వదలబోతున్నాడు. సాధారణంగా టీజర్ అంటే నిమిషం లోపే ముగుస్తాయి.కానీ.. ఈ టీజర్ నిడివి ఎక్కువని, దాదాపుగా 2 నిమిషాలు ఉంటుందని టాక్.
గతంలో కూడా ఓ టీజర్‌ని రెడీ చేసింది పుష్ప టీమ్. కాకపోతే… అందులోని డైలాగ్ ఒకటి ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. డైలాగ్ లీక్ అయిపోతే.. టీజర్ చూస్తున్నప్పుడు ఆ కిక్ ఉండదని భావించిన సుకుమార్ ఏకంగా కట్ చేసిన టీజర్‌నే పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆ టీజర్‌లోని షాట్లు సైతం.. ఈసారి కనిపించబోతున్నట్టు టాక్. అలా.. టీజర్ నిడివి పెరిగింది. పుష్ప 1 పెద్ద హిట్టవ్వడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకొనే స్థాయి తన సినిమాలో ఉందన్న విషయం ఈ టీజర్ తోనే చెప్పే ప్రయత్నం చేయబోతున్నాడట సుకుమార్. పుష్ప క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ ఈ టీజర్ లో హైలెట్ కాబోతోందని సమాచారం.