పరీక్ష రాసే విద్యార్థి చివరి నిమిషం వరకు పుస్తకం వదలనట్టు డైరెక్టర్ సుకుమార్ కూడా ఫైనల్ అవుట్ ఇచ్చేవరకు సినిమానే అంటిపెట్టుకొని ఉంటారు. ఇది ఆయనకి మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే పుష్ప విషయానికి వచ్చేసరికి సినిమా చుట్టూ క్రేజ్, భారీ అంచనాలు కావచ్చు.. అది ఇంకాస్త ఎక్కువైంది. డిసెంబర్ 5 పుష్ప2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఇప్పటికి పాత అయిపోవాల్సిందే. కానీ ప్రొడక్షన్ జాప్యం వల్ల ఈ సినిమా వాయిదాలు పడింది. చాలా టైం సుకుమార్ చేతికి దొరికింది. అయితే ఈ టైం కూడా సుకుమార్ కి నెక్ అఫ్ ది మూమెంట్ లానే వుంది.
ప్రస్తుతం పుష్ప పనులు చాలా హడావిడిగా టెన్షన్ టెన్షన్ గా జరుగుతున్నాయి. నవంబర్ 20 కి ఫైనల్ అవుట్ ఇచ్చేస్తానని సుకుమార్ మాటిచ్చారు. కానీ ఇప్పటికీ కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా రెండు పాటలు షూట్ చేయాలి. ఇందులో ఒక్క పాటే వీడియోగా షూట్ చేసి మిగతాది కేవలం ఆడియోలోనే ఉంచాలి అనుకుంటున్నారు. దీనికి కారణం సమయం లేకపోవడమే.
అలాగే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప టీమంతా చాలా హర్రీబర్రీగా వర్క్ చేస్తుంది. ఇకపోతే పుష్ప ప్రమోషన్స్ పాన్ ఇండియా స్థాయిలోప్లాన్ చేశారు. ఇండియాలోనే ప్రధాన నగరాల్లో కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేశారు. వాటన్నిటికీ అల్లు అర్జున్ మిగతా టీమ్ అంతా హాజరు అవ్వాలి. అయితే ప్రమోషన్స్ లో సుకుమార్ కనిపించకపోవచ్చు. దీనికి కారణం పెండింగ్ పనులే. ఎట్టిపరిస్థితిలో ఈనెల 20కి సినిమా ఫైనల్ అవుట్ ఇచ్చేయాలని వర్క్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీం. అయితే సుకుమార్ ఇంకో వారం బఫర్ టైమ్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వినిపిస్తోంది.