ఆయన వైసీపీ ఎమ్మెల్యే. ఐదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఇతర పార్టీల వైపు చూడలేదు. కానీ.. ఇప్పుడు ఆయనను ప్రతిపక్ష పార్టీ కంటే ఘోరంగా చూస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి. దాంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మత్తు ఇంజక్షన్ చేసుకుని, చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జగనన్న అంటూ.. వీడియో వాంగ్మూలం కూడా ముందుగానే రికార్డు చేసుకున్నారు. నాలుగు రోజుల కిందట సునీల్ హైదరాబాద్లో లోటస్ సపాండ్లో జగన్ను కలిసేందుకు తన భార్య డాక్టర్ మమతారాణితో కలసి వెళ్లారు. అయితే జగన్ను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
తనపై ఎంత రాజకీయ ఒత్తిడులు వచ్చినా పార్టీకి విధేయుడుగా ఉన్నప్పటికీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో చూసి పోలీసులు ఆయన ఎక్కడున్నారో వెదికారు. పూతలపట్టులో ఓ చర్చిలో ఉన్నట్లు గుర్తించారు. మణికట్టు వద్ద బ్యాండేజ్ కట్టి ఉండడంతో పాటు సెలైన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాన్లా కుడి చేతికి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నాన్ని సునీల్ భార్య అడ్డుకున్నారు. తాను డాక్టర్నని, వైద్యం చేసుకుంటానని బదులివ్వడంతో పోలీసులు వెనుదిరిగి, అక్కడ కాపలా ఏర్పాటు చేశారు.
మొత్తానికి టిక్కెట్ల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానంతో ఆ పార్టీ నేతలు.. ఇబ్బందులకు గురవుతున్నారు. తాను ఇచ్చిన వారికే టిక్కెట్లు తీసుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్కరితోనూ చర్చించడం లేదు. దాంతో.. నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. సునీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలోనూ అదే చెప్పారు. తనను కనీసం గుర్తించకపోవడంతో.. ఆయన ఆవేదనకు గురయ్యారంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీకి నిబద్దతతో ఉన్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. సునీల్ ఆత్మహత్యాయత్నం.., కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.