అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను రెచ్చగొట్టేశారు. ఉక్రెయిన్‌కు బైడెన్ లాంగ్ రేంజ్ క్షిపణుల్ని రారా చేయడమే కాకుండా వాటిని రష్యాపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో ఇదే సందనుకుని ఉక్రెయిన్ అమెరికా ఇచ్చిన ఆయుధాలతో రష్యాపై దాడి చేసేసింది. ఇప్పుడు పుతిన్ తమ శత్రువు ఉక్రెయిన్ మాత్రమే కాదని.. ఆయుధాలు ఇచ్చి తనపై దాడి చేసిన అమెరికా కూడా అని డిక్లేర్ చేసి.. అణుబాబులు వేయడానికి ఏర్పాట్లు ప్రారంభించేశారు.
రష్యా వద్ద అణుబాంబులు చాలా ఉన్నాయి. అమెరికాలోని కీలక పట్టణాల్ని టార్గెట్ చేసే రేంజ్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అణుబాంబుల్ని అమెరికా వైపు గురి పెడుతున్నారు పుతిన్. నేడో రేపో పదవి నుంచి దిగిపోయే బైడెన్.. ఉక్రెయిన్ కు ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి..వాటిని రష్యాపై దాడి చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వాలి అనే చర్చ అమెరికాలో జరుగుతోంది. ఇప్పుడు పుతిన్ రష్యాపై అణుదాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.
పుతిన్‌కు ట్రంప్‌తో స్నేహం ఉంది. కానీ పుతిన్ కు తమ దేశం తప్ప మరో ఎజెండా ఉండదు. తనపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు సాయం చేసిన అమెరికాను ట్రంప్ తో ఉన్న స్నేహం కోసం క్షమించడం కష్టం. అందుకే అమెరికా తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన ఇస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వేళ అమెరికాపై రష్యా దాడి చేస్తే.. అమెరికా ఊరుకోదు. ప్రతిదాడి చేస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. ట్రంప్ కూడా దాన్ని ఆపలేరు.
ఇప్పటికి ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తయింది. రెండుదేశాల తరపున లక్షల మంది చనిపోయారని వార్తలొస్తున్నాయి. కానీ ఆ రెండు దేశాలు మాత్రం పంతం వీడటంలేదు. ఉక్రెయిన్ కు నాటో దేశాలు ఆయుధాలిస్తూ.. యుద్ధం కొనసాగించేలా చేస్తున్నాయి.