ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ను.. పీవీ సింధు.. గెలుచుకుంది. తన కెరీర్లో.. అత్యున్నత .. చాంపియన్ షిప్ సాధించాలన్న లక్ష్యంతో వరుసగా.. గత మూడేళ్లుగా చేస్తున్న దండయాత్రలో రెండు సార్లు విఫలమైనప్పటికీ.. మూడో సారి.. సంచలన విజయం నమోదు చేసింది. చరిత్రలో చెరుపని విధంగా తన పేరును లిఖించుకుంది. సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఫైనల్లో.. జపాన్ షట్లర్ నజోమి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో.. వరుస సెట్లలో గెలిచి.. తన రాకెట్ పవర్‌ను చాటింది.
చాంపియన్ షిప్ కోసం దండయాత్ర.. ! ఎట్టకేలకు సక్సెస్..!
పీవీ సింధు పోరాటం.. అసాధారణం. వరుసగా ఈ సారి మూడో ఏడాది.. ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరింది. కానీ… ఈ ఏడాదే విజయం సాధించింది. గత రెండేళ్లుగా.. ఫైనల్ దాకా వెళ్లింది. కానీ చాంపియన్ అవలేకపోయింది. కానీ ఆమె ఎక్కడా నీరు కారిపోలేదు. ఓటమి గెలుపునకు నాంది అనుకుంది. కఠోర శ్రమ సాధించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరి సత్తా చాటిన సింధు ఫైనల్ లో ఒకహురాపై విజయం సాధించి 2017 ఫైనల్ లో తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2017లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో ఒకహురాతో తలపడిన సింధు మూడు సెట్ల పాటు హోరాహోరీగా తలపడింది. రెండు గంటల పాటు జరిగిన నాటి ఫైనల్ లో సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కానీ ఇప్పుడు అదే ఒకుహరాపై…. తిరుగులేని ఆధిపత్యంతో విజయం సాధించింది. గత ఏడాది కరోలినా మారిన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సారి ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
బ్యాడ్మింటన్ దిగ్గజాలందరిలోకల్లా.. సింధునే టాప్..!
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో .. ప్రకాష్ పదుకొనే.. గోపీచంద్.. సైనా నెహ్వాల్ లాంటి.. ప్లేయర్లు.. చరిత్ర సృష్టించారు కానీ.. ఎవరూ… ప్రపంచ చాంపియన్ షిప్ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఒక్క మేల్ ప్లేయర్ కూడా.. వరల్డ్ చాంపియన్ కాలేకపోయారు. కానీ.. ఆ రికార్డును సింధును కొట్టేసింది. ఆమె…భారత దేశ చరిత్రలోనే… బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన మొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు.
కఠోరశ్రమ.. అంకిత భావానికి ప్రతీక సింధు..!
సింధుకు ఈ విజయం సునాయాసంగా రాలేదు. అవకాశాన్ని ఆయుధంగా మల్చుకుంది.. కొరియా కోటలను బద్దలుకొట్టింది. చైనీస్ ప్లేయర్లను మట్టి కరిపించింది. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంది. తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్ చరిత్ర లిఖించింది. ఎత్తిపట్టిన రాకెట్‌తో ఎదురెళ్లి ప్రతీకారం తీర్చుకుంది. బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో అడ్డంకితో దూరమైపోయిన టైటిల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టుకుంటూ భారత సింధూరంగా మారింది.