టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెల్చుకున్నారు. రజతం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ హీ బింగ్జియాని రెండు వరుస సెట్లలో మట్టి కరిపించిన సింధు.. రజతం కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో ఓటమితో స్వర్ణం ఆశలు గల్లంతయినప్పటికీ.. సింధు ఎక్కడా నిరాశపడలేదు. ఆరంభం నుంచి ఎటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. వరుస సెట్లను 21-13, 21- 15 తేడాతో విజయం సాధించింది. చైనా షట్లర్ బింగ్జియా ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేదు. దేశానికి పతకం తేవాలన్న లక్ష్యంతో ఆడిన సింధు పట్టుదల ముందు బింగ్జియా తల వచించింది.
గత ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్న సింధు.. ఈ సారి రజతంతో సరి పెట్టుకున్నారు. అయినా ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి.. చరిత్ర సృష్టించారు. మహిళా ప్లేయర్లో ఇంత వరకూ రెండో మెడల్ గెల్చిన వారు లేరు. రెజ్లర్ సుశీల్ కుమార్ గతంలో రెండు పతకాలు సాధించారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత పతకాల ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రస్తుత ఒలింపిక్స్‌లో సింధు తీసుకొచ్చింది రెండో పతకం. మొదటి పతకం మీరాబాయి చాను .. వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించారు.
రియో ఒలింపిక్స్‌లో విజయం త్రవాత ప్రపంచబ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ను.. పీవీ సింధు.. గెలుచుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో .. ప్రకాష్ పదుకొనే.. గోపీచంద్.. సైనా నెహ్వాల్ లాంటి.. ప్లేయర్లు.. చరిత్ర సృష్టించారు కానీ.. ఎవరూ… ప్రపంచ చాంపియన్ షిప్ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఒక్క మేల్ ప్లేయర్ కూడా.. వరల్డ్ చాంపియన్ కాలేకపోయారు. కానీ.. ఆ రికార్డును సింధును కొట్టింది.ఇప్పుడు రెండో పతకంతో .. భవిష్యత్ క్రీడాకారులకు సవాల్ విసిరింది.