మహేష్‌బాబు బ్రహ్మోత్సవం దెబ్బకు పీవీపీ ఇప్పట్లో తేరుకొనేట్టు కనిపించడం లేదు. ఎంత పోతుందన్నది రమారమీగా తెలీదుగానీ.. కనీసం సగానికి సగం మునిగిపోవడం ఖాయం. ముఖ్యంగా భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం పీవీపీ అండ్ కో.. నష్టమెంత? అనే లెక్కలు తేల్చడంలో బిజీగా ఉందని టాక్. ఈమధ్య ఏ పెద్ద సినిమా పోయినా, ఆ నిర్మాతని బయ్యర్లు చుట్టుముట్టేస్తున్నారు. నష్టాన్ని భర్తీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ తలనొప్పి ఎందుకని ‘నో రిటర్న్స్’ అంటూ ఓ కాగితంపై సంతకం పెట్టించుకొన్నాడట పీవీపీ. దాంతో బయ్యర్లకు ఇప్పుడు డిమాండ్ చేసే ఛాన్సు లేదు. కానీ.. పీవీపీ పెద్ద మనసుతో నష్టాల్ని భర్తి చేస్తానంటూ బయ్యర్లకు ఇప్పుడు భరోసా ఇస్తున్నాడట.
”30 నుంచి 40 శాతం పోతే మీరే చూసుకోండి.. అంతకంటే ఎక్కువ నష్టపోతే నేను భర్తీ చేస్తా” అంటూ బయ్యర్లకు మాటిచ్చాడట పీవీపీ. దాంతో వాళ్లు కాస్త రిలాక్స్ అవుతున్నారు. 20 శాతం నష్టాల్ని భరించడం అంటే మాటలు కాదు. అదీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదాయె. కానీ.. పీవీపీ పెద్ద మనసుతో వ్యవహరిస్తుండడంతో బయ్యర్లు ఖుషీ అవుతున్నారు. నిజంగా ఇదంతా నిజమైతే, బయ్యర్లకు పీవీపీ కనీసం ఇలాగైనా ఆదుకొంటే.. ఆయన దేవుడు కిందే లెక్క.