ఊపిరి సినిమా వివాదం తెలిసిందే. ఈ సినిమా వల్ల తమ సంస్థకు భారీ నష్టాలొచ్చాయని, దానికి వంశీ పైడిపల్లి సమాధానం చెప్పాలని నిర్మాతల మండలిలో పీవీపీ సంస్థ ఫిర్యాదు చేసింది. మహేష్‌తో ఓ సినిమా చేస్తానని చెప్పి, ఆరు నెలలు కాలయాపన చేసి, ఆ కథని మరో సంస్థలో చేయడం కూడా కుదరదని, మహేష్ – వంశీపైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా కథ పై పూర్తి హక్కులు పీవీపీ సంస్థకే ఉన్నాయంటూ… పీవీపీ గట్టిగా పోరాడింది. దానికి వంశీపైడిపల్లి కూడా కౌంటరిచ్చాడు. వీరిద్దరి మధ్య వివాదం నడుస్తుండగానే.. ఇప్పుడు ఇద్దరూ స్మయిల్ ప్లీప్ అనగానే కెమెరా ముందుకొచ్చి పోజులిచ్చారు. ఘాజీ ప్రీమియర్ షోకి వచ్చిన సినిమా సెలబ్రెటిల్లో వంశీ కూడా ఉన్నాడు. పీవీపీ, వంశీ మధ్య ఇదివరకటి ఆప్యాయతలూ అలింగనాలు కనిపించాయి. దాంతో చిత్రసీమ ఆశ్చర్యపోతోంది.
వీరిద్దరి మధ్య గొడవ చప్పున చల్లారిపోయిందా? ఇద్దరిలో ఎవరి తగ్గారు? అనే చర్చ మొదలైంది. ఇద్దరిలో వెనకడుగు వేసింది మాత్రం పీవీపీనే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. వంశీపైపడిపల్లి పీవీపీని కంట్రోల్‌తో తెచ్చేందుకు పెద్ద స్కెచ్చే వేశాడట. వంశీకి టీఆర్ ఎస్ గవర్నమెంటుతో సత్సంబంధాలున్నాయి. కేటీఆర్ ఆప్త మిత్రుడు. అలాంటప్పుడు కేటీఆర్ తన స్నేహితుడిపై ఈగ వాలనిస్తాడా?? పైగా మహేష్ బాబు సపోర్ట్ కూడా వంశీకే ఉందట. మహేష్‌తో ఇక మీదట జరిగే లావాదేవీల విషయంలో ఎలాంటి పేచీ రాకూడదన్న ఉద్దేశంతో పీవీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పైగా తాను చేసిన ఫిర్యాదులో ఎలాంటి బలం లేదని పీవీపీకి తెలుసు. అందుకే.. ఆ ఊసు మర్చిపోయి వంశీతో అన్నాదమ్ముల బంధం కొనసాగించడానికి నిర్ణయించుకొంది. అదీ మేటరు.