హైదరాబాద్: పీవీపీ సంస్థ నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రధారులుగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఫ్రాన్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ముగ్గురూ కలిసిఉన్న ఫోటోను నాగార్జున తన ఫేస్బుక్ పేజిలో పోస్ట్ చేశారు. షూటింగ్ పదిహేను రోజులు పూర్తయిందని, ఇంకా పది రోజులుందనికూడా పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలుకూడా తీస్తామని, ప్యారిస్ వీధుల్లో ఛేజింగ్ సీన్లు చిత్రీకరిస్తామని దర్శకుడు వంశీ పైడిపల్లి ముందే చెప్పారు. పీవీపీ సంస్థ ఈ ప్రాజెక్టును ద్విభాషా చిత్రంగా రూపొందిస్తోంది. మొదట శృతిహాసన్‌ను తీసుకున్నప్పటికీ, ఆమెతో విభేదాలు ఏర్పడటంతో తమన్నాను ఆమె స్థానంలో తీసుకున్నారు. మరోవైపు అనుష్క ఈ మల్టీ స్టారర్ చిత్రంలో అతిథిపాత్రలో నటించటం విశేషం.