తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిధుల సమస్య తీరిపోయినట్లే కనిపిస్తోంది. గురువారం రోజు కోకాపేటలో 43 ఎకరాలు అమ్మేస్తే ఏకంగా రూ. 3300 కోట్ల వరకూ ఆదాయం వచ్చింది. అంటే సగటున 73 కోట్ల రూపాయలకుపైగానే వచ్చింది. భూములు అమ్ముకోవడానికి తెలంగాణ సర్కార్ కు బోలడెండ భూ బ్యాంక్ ఉంది. అదీ కూడా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనే . హెచ్ఎండీఏ చాలా కాలంగా ఇదే పనిలో ఉంది. తెలంగాణ సర్కార్కు గత ఆర్థిక సంవత్సరంలో పది వేల కోట్లకుపైగా భూముల అమ్మకం ద్వారా ఆదాయం వస్తే ఈ ఏడాది అది ముఫ్పై వేల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలా విచ్చలవిడిగా అప్పులు చేసుకోవడానికి తెలంగాణకు కేంద్రం అనుమతించడం లేదు. బ్యాంకుల ద్వారా కూడా అప్పులు అందకుండా చేస్తున్నారు. ఓ వైపు ఎన్నికలు వస్తున్నాయి. అమలు చేయాల్సిన హామీలు లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా రుణమాఫీని కూడా ప్రకటించారు. వీటన్నింటినీ నిధుల కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ముందుగానే మద్యం దుకాణాల వేలం వేసి రూ. రెండు వేల కోట్ల వరకూ ఆదాయం పొందబోతున్నారు. మిగతా మొత్తాన్ని భూముల వేలం ద్వారా సమీకరిస్తున్నారు. అంటే కేసీఆర్ స్కీమ్స్ లకు నిధుల సమస్య పరిష్కారమయినట్లే.
కేసీఆర్ గత ఎన్నికల సమయంలో ఇచ్చినహామీలన్నీ పెండిం్ ఉండిపోయాయి. ఏ ఒక్క దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. కానీ కొత్త హమీల్ని అమలు చేశారు. దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు వంటి పథకాలు మేనిఫెస్టోలో లేవు . అయినా అమలు చేస్తున్నారు. ఓటింగ్ కు వెళ్లే ముందు సంతృప్తి స్థాయిలో ఓటర్లను .. సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ చేస్తున్న నిధుల యజ్ఞానికి కోకాపేట భూములు సహకరిస్తున్నాయి.