స్టార్ డైరక్టర్ సుకుమార్ కు సడెన్ గా నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది .. అనుకున్నట్టుగానే కుమారి కథ రాసుకుని తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూర్య ప్రతాప్ ని డైరక్టర్ గా చేసి సినిమా స్టార్ట్ చేసేశాడు. అయితే సినిమాకు కెమెరా మెన్ గా తనకు ‘ఆర్య’, ‘1 నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన క్రేజీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని కన్సల్ట్ చేశాడు. రోబో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసిన రత్నవేలు కుమారి సినిమాను ఒప్పుకున్నారు.
కుమారి సినిమాకు కెమెరా మెన్ గా చేయడమే కాదు సినిమాకు గాను రెమ్యునరేషన్ గా చిల్లి గవ్వ కూడా ఆశించలేదు. ఏంటి నిజమా సుకుమార్ సినిమా కోసం భారతదేశం గర్వించే కెమెరా మెన్ రత్నవేలు రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేశారా అంటే.. నిజమే అని చెబుతున్నాయి కుమారి చిత్ర యూనిట్. కేవలం సుకుమార్ మీద ఉన్న అభిమానం తోనే ఈ సినిమా తీశా తప్ప డబ్బు ఆశించి కాదు అని కుమారి 21ఎఫ్ ప్రమోషన్స్ లో రత్నవేలు వివరణ ఇచ్చాడు.
అంతేకాదు సుక్కు సినిమాలకు సంగీతం అందించే దేవి శ్రీ ప్రసాద్ కూడా కుమారి 21ఎఫ్ సినిమాకు ఎటువంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట. ఇన్ని అద్భుతాలు జరుగబట్టే కుమారి 21ఎఫ్ సినిమా అంత భారీ స్థాయికి చేరుకుంది. చూడ్డానికి చిన్న సినిమానే అయినా చాలా గొప్ప టాలెంట్ ఉన్న వారు సినిమాకు పని చేయడం జరిగింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించి కుమారి 21ఎఫ్ సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మరి సుకుమార్ రైటింగ్స్ అండ్ సుకుమార్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న ఈ తొలి సినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.