విజయ్ దేవరకొండ కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. ఇటీవల `కామ్రెడ్` చిత్రాన్ని పట్టాలెక్కించిన విజయ్.. ఇప్పుడు మరో సినిమాకి పచ్చజెండా ఊపాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయాల్సివుంది. కె.ఎస్.రామారావు నిర్మాత. ఈ సినిమా ఇప్పుడు ట్రాక్ ఎక్కబోతోంది. ఈనెల 18న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. కథానాయికలుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌లను ఎంచుకున్నారు. కొత్త కథానాయికల జోరుతో.. రాశీఖన్నా ప్రభావం తగ్గింది. రాశీ పేరుని ఈమధ్య పరిశీలించడమే మానేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రాశీకి మంచి ఛాన్స్ వచ్చినట్టే. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. `మళ్లీ మళ్లీ ఇది రానిరోజు`తో హిట్టు అందుకున్న క్రాంతి మాధవ్ `ఉంగరాల రాంబాబు`తో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఈసారి విజయ్ కోసం ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ రాశాడట. ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.