తెలుగులో నితిన్ హీరోగా చేస్తున్న ‘శ్రీనివాస కల్యాణం’, తమిళంలో ‘జయం’ రవి హీరోగా చేస్తున్న ‘అడంగమరు’ సినిమా షూటింగులతో ఈ సమ్మర్లో ఇప్పటివరకూ బిజీ బిజీగా గడిపారు రాశిఖన్నా. ఛండీఘడ్, హైదరాబాద్, చెన్నై… రెండు సినిమాల కోసం చాలా సిటీలు తిరిగారు. రెండు సినిమాల తాజా షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొంచెం బ్రేక్ దొరికింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేశారు రాశిఖన్నా. సింగపూర్ వెళ్తున్నారామె. ఆల్రెడీ చెన్నైలో ఫ్లైట్ కూడా ఎక్కేశారు. క్లోజ్ ఫ్రెండ్, హిందీ హీరోయిన్ వాణికపూర్‌తో కలిసి అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ ఇంతకుముందు చాలాసార్లు ఈ విధంగా హాలిడే ట్రిప్స్‌కి వెళ్ళారు. అదండీ సంగతి!