రాశీఖన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. రెండేళ్లయ్యిందో లేదో, ఎన్ని తెలివితేటలు తెచ్చేసుకొందో..? ఏ విషయమైనా ఆచి తూచి మాట్లాడుతుంది. ఈగోలకు పోదు.. అలాగని తనని తాను తక్కువ చేసుకోదు. వాస్తవంలో ఉంటూ, వాస్తవంలో బతుకుతుంది. అందుకే.. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ పేరు తెచ్చేసుకొంది. రాశీ మాటలు వింటే.. ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. బాగా ముదిరిపోయింది.. అంటూ షాక్ అవ్వాల్సిందే. రాశీ అలానే మాట్లాడుతోంది మరి. ‘అస్తమానూ గ్లామర్ షో అంటే ఇబ్బంది లేదా ‘ అంటే.. ఏం చెప్పిందో తెలుసా?? ”గ్లామర్ లేకపోతే మీరు సినిమా చూస్తారా?? అసలు హీరోయిన్ అందంగా ఉండదు అంటే ఆ సినిమాకి వెళ్తారా” అంటూ ఎదురు ప్రశ్నించింది. నిజమే మరి.. డీ గ్లామర్ సినిమాలెవరు చూస్తారిప్పుడు?
సినిమా అంటే గ్లామర్, గ్లామర్ అంటే సినిమా.. ఇదే తాను నమ్ముతున్న సూత్రమంటోంది. మనమేదో గొప్పయాక్టర్ అనుకొని, వీర లెవిల్లో యాక్టింగ్ చేసేద్దామంటే కుదరదు.. నటికి పరిణితి రావాలంటే వయసు కూడా ముఖ్యమే. నా వయసుకి గ్లామర్ షోనే కరెక్ట్ అంటోంది రాశీ. మరీ ఇంత కమర్షియల్‌గా మాట్లాడితే మనం ఏం చేస్తాం..? రాశీ బాగా ముదిరిపోయింది అనుకోవడం తప్ప.