ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచిప్రత్యేకహోదాపై పొలిటికల్ కబడ్డి జరుగుతోంది. ఈ కబడ్డీలో ఇప్పటి వరకు చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డిది పై చేయి అయింది. చంద్రబాబు వెనుకబడి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. చంద్రబాబు పాటించేవారన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
హోదా ఉద్యమంలో మొదట రేస్ జగన్‌దే..!
రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు జగన్. ఎన్డీఏలో లేరు. అందుకే ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాను స్వాగతించినప్పుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి..మాకు ప్రత్యేకహోదానే కావాలన్న విధానాన్ని తీసుకున్నారు. కానీ మళ్లీ తర్వాత చంద్రబాబు రివర్స్ అయ్యారు. ప్రత్యేకహోదా కావాల్సిందేనన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి.. ఇంకో అడుగు ముందుకేసి.. ప్రత్యేకహోదా కావాలంటున్నావ్.. ఎన్డీఏలో ఎందుకున్నావ్ అని అడిగాడు.. చంద్రబాబు ఎన్డీఏ నుంచి తన మంత్రులను ఉపసంహరించుకున్నరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముందుకొచ్చి.. ఎన్డీఏ నుంచి మంత్రులను విరమించుకున్నావ్.. కానీ నీ పార్టీ ఎన్డీఏలోనే ఉందన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు తన పార్టీని ఎన్డీఏ నుంచి బయటకు తీసుకు వచ్చారు. అప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి.. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే సరిపోతుందా… అవిశ్వాసం పెట్టి.. సంగతేమిటో తేల్చాలన్నారు. అప్పుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినా మద్దతిస్తానన్నారు.
వ్యూహాత్మకంగా పైచేయి సాధించిన చంద్రబాబు..!
అంతకు ముందుకు అవిశ్వాస తీర్మానం పెడితే ఉపయోగమేమిటి అన్నారు. అంతకు ముందు.. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ఉపయోగమేమిటి అన్నారు. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి.. పై చేయి సాధించారు. చివరకు రాజీనామాలు చేసి… మీరెందుకు రాజీనామాలు చేయరని చంద్రబాబును అడిగారు జగన్. అప్పుడు టీడీపీ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఎప్పుడైతే.. అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేశారో.. అప్పుడే ఈ ప్రత్యేకహోదా కబడ్డీలో జగన్మోహన్ రెడ్డికి పైచేయి పోయి… చివరి దశకు వచ్చే సరికి చంద్రబాబు పైచేయి సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. దేశం మొత్తం అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆసక్తికరంగా చూసింది. ఈ పరిణామాలన్నీ.. తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా పైచేయి సాధించి పెట్టాయి.
రాజీనామాలతో వైసీపీ సెల్ఫ్ గోల్.. !
మేము రాజీనామాలు చేయడం వల్లే వేడి తగిలి.. అవిశ్వాసాన్ని అంగీకరించారని వైసీపీ నేతలు వాదించారు. మరో మాట ఏమంటున్నారంటే.. టీడీపీ – బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే… మేము రాజీనామాలు చేసిన తర్వాతే.. అవిశ్వాసాన్ని ఆమోదించారని చెప్పుకొచ్చారు. ఈ రెండు వాదనలు కూడా సమంజసమైనవి కావు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తప్పే. రాజీనామాలు చేయాలంటే.. ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగేలా చూసుకోవాలి. పదవి కాలం ఒక ఏడాది లోపు ఉంటే ఉపఎన్నికలు నిర్వహించరు. దీని ప్రకారం.. సమయం చూసుకుని.. రాజీనామాలను ఆమోదింప చేసుకున్నారు. వైసీపీ ఉపఎన్నికలను కోరుకోలేదని.. దీని ద్వారా తెలిసిపోతుంది. నిజానికి బడ్జెట్ సమావేశాలు ముగినప్పుడే రాజీనామాలను ఆమోదింప చేసుకునే ఉంటే.. పైచేయి సాధించేవారు.
హోదాయోధుడు చంద్రబాబే..!
నిజానికి వైసీపీ, బీజేపీ ముందే మాట్లాడుకుని రాజీనామా డ్రామాలు నడిపాయన్న అంచలున్నాయి. మామూలుగా అయితే… ఆమోదం అనేది ఆ పార్టీల మధ్య లేదు. కానీ బీజేపీ వ్యూహం మార్చుకుని రాజీనామాలు ఆమోదించడంతో వైసీపీ నష్టపోయింది. రాజీనామాలు చేయడంలో.. వైసీపీ వ్యూహం ఘోరంగా విఫలమయింది. పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని అంచనా వేసి కూడా వైసీపీ రాజీనామాలు చేసింది. కొద్దిగా ఆలోచించి ఉంటే… ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పుడు చంద్రబాబుపై పూర్తిగా పై చేయి అయింది.