✍ అమెరికాలో జాత్యహంకార దాడులు పెచ్చరిల్లుతున్నాయి. వరుస దాడులతో భారతీయుల్లో హైటెన్షన్ నెలకొంది. మొన్నటికి మొన్న హర్నీష్ పటేల్ అనే గుజరాత్ సంతతి వ్యాపారి హత్య మరవకముందే.. అమెరికాలో మరో జాత్యహంకార దాడి చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతి అనే యువతిపై అమెరికాలో ఓ నల్ల జాతీయుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
కాన్సస్ లో కూచిభొట్ల శ్రీనివాస్, సౌత్ కరోలినాలో హర్నీశ్ పటేల్, న్యూయార్క్ లో సిక్కు యువకుడి, ఇప్పుడు మరో తెలంగాణ యువతిపై దాడి ఘటనలు చూస్తుంటే అమెరికాలో ఇండియన్స్ కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది