టాలీవుడ్ మెల్లమెల్లగా షూటింగ్ మోడ్‌లోకి వెళ్తోంది. పెద్ద సినిమాలన్నీ ఒకొక్కటిగా సెట్స్‌పైకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన `రాధే శ్యామ్` ఇప్పుడు కొత్త షెడ్యూల్ శ్రీకారం చుట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఇటలీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అక్కడ చాలా వరకూ షూటింగ్ చేశారు. హైదరాబాద్ లో వేసిన సెట్స్‌లలో.. ఇటలీకి మ్యాచింగ్ గా ఇండోర్ సీన్లు తీశారు. ఇప్పుడు మళ్లీ ఇటలీ ప్రయాణం కాబోతోంది చిత్రబృందం. 15 రోజుల ఓ చిన్న షెడ్యూల్ కోసం ఇటలీ విమానం ఎక్కబోతున్నాడు ప్రభాస్.
ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా వచ్చేశాయని, వీసాలు రెడీ అయ్యాయని తెలుస్తోంది. ఈనెలాఖరున గానీ, అక్టోబరు మొదటి వారంలోగానీ ఇటలీ వెళ్తుంది చిత్రబృందం. అక్కడ 15 రోజుల షూటింగ్ అనంతరం మళ్లీ తిరిగొస్తుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ రూపొందించారు. ఇటలీ షెడ్యూల్ అయ్యాక….మిగిలిన భాగాన్ని ఇక్కడి సెట్స్‌లోనే చిత్రీకరించనున్నారు.