తెలుగునాట రాధికా ఆప్టే పద్ధతైన పాత్రలే చేసింది. ఒక్కసారంటే ఒక్కసారి కూడా హద్దు మీర లేదు. కానీ రాధిక హద్దు మీరితే ఏ రేంజులో ఉంటుందో తెలిసొచ్చింది. రాధికా ప్రధాన పాత్రలో బాలీవుడ్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అదే… పర్చేద్. ఇదో ఆర్ట్ సినిమా. అయితే.. హాట్ సన్నివేశాలు మాత్రం బోల్డన్ని ఉన్నాయట. తాజాగా ఈసినిమాలోని కొన్ని దృశ్యాల్ని యూ ట్యూబ్‌లో వదిలింది చిత్రబృందం. అందులో రాధిక రెచ్చిపోయింది. ఓ సన్నివేశంలో న్యూడ్‌గా కనిపించింది. ఒక్క మాటలో బరి తెగించి నటించింది. నీలి చిత్రాల్లో సన్నివేశాలుంటాయే.. ఆ స్థాయిలో ఉందా దృశ్యం. అది చూసి.. ‘ఏంటి రాధిక మరీ ఇంతగా రెచ్చిపోయింది’ అంటూ ముక్కుమీద వేలేసుకొంటున్నారు సినీ జనాలు.
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇలాంటి సీన్ ఒకటి వదిలితే.. జనాలు థియేటర్ల ముందు క్యూ కడతారని చిత్రబృందం భావించి, ఓ సీన్‌ని లీక్ చేసిందని.. సెన్సార్ వాళ్లను దాటుకొని ఆ సన్నివేశం వచ్చినప్పుడు చూద్దామని చెబుతున్నారు. సెన్సార్ దాటుకొని వచ్చినా రాకపోయినా.. రాధిక ఎంతలా రెచ్చిపోయిందో అర్థమవుతూనే ఉంది. ఆ సినిమా బయటకు వచ్చేలోగా.. ఈ ఒక్కసీన్ కావల్సినంత ప్రచారాన్ని మూటగట్టుకొని తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.