కథానాయికలు తెలివి మీరిపోయారు. సందర్భానికి తగినట్టు మాట్లాడడంలో ఆరి తేరిపోయారు. రాధికా ఆప్టే కూడా అంతే! ఇప్పుడు రజనీకాంత్‌తో కలిసి కబాలి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా గురించిన ప్రస్తావన ఎప్పుడొచ్చినా రజనీకాంత్ గురించి గొప్పలుకుప్పలుగా చెబుతోంది. రజనీ అంతా.. ఇంతా అంటూ అడక్కుండానే పాఠాలు వల్లిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ మరీ వయసైపోయిన వాడిలా కనిపిస్తున్నారు కదా, మరి ఆయనతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదా? అని అడిగితే.. ”అసలు మీకో నిజం తెలుసా?? అమ్మాయిలకు ముసలోళ్లంటేనే ఇష్టం” అని కొత్త లాజిక్తీసింది.
తమకంటే వయసు ఎక్కువగా ఉన్న మగవాళ్లని ఆడవాళ్లు ఇష్టపడతారట. ఇందులో తాను కూడా మినహాయింపు కాదని రాధిక అంటోంది. ”కారణాలు నాకు స్పష్టంగా తెలీవుగానీ.. వయసులో నాకంటే పెద్దవాళ్లని నేను ఇష్టపడతా. అది గౌరవం వల్ల కావొచ్చు. వాళ్లకున్న హుందాదనం వల్ల కావొచ్చు” అంటోంది. ఈసినిమాలో రజనీతో తన కెమిస్ట్రీ బాగా పండిందట. తామిద్దరి మధ్య వచ్చేసీన్లు… గుర్తిండిపోయేలా దర్శకుడు మలిచాడని కితాబు ఇస్తోంది రాధికా ఆప్టే.