రఘురామకృష్ణరాజును తమ ఎంపీగా గుర్తించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. ఆయన పేరును తమ ఎంపీల జాబితా నుంచి తొలగించింది. ఇక ఆ పార్టీ నేతలెవరూ… తమ ఎంపీ అని సంబోధించకూడదని అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అదే సమయంలో పార్టీకి సంబంధించి ఎలాంటి అధికారిక పత్రాలు.. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అయినా రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకూడదని దిశానిర్దేశం జరిగిపోయింది. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో.. ఎంపీల జాబితా నుంచి కూడా ఆయన పేరును తొలగించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేయడమో.. పార్టీ నుంచి బహిష్కరించడమో చేసి ఉంటారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయడమో.. పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తే.. ఆయన పదవి సేఫ్గా ఉంటుంది. ఆయనపై అనర్హతా వేటు వేయడానికి అర్హత ఉండదు. ఈ కారణంగా ఇంత కాలం. .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన .. ఎన్ని విమర్శలు చేస్తున్నా… నిస్సహాయంగా ఉండిపోయింది కానీ చర్యలు తీసుకోలేదు. ఆయనకు షాక్ ఇవ్వాలంటే లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయించడం ఒక్కటే మార్గమని గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా స్వయంగా ఈ విషయాన్ని టేకప్ చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత నేడో… రేపో అనర్హతా వేటు తప్పదన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. ఈ లోపే.. ఎంపీల జాబితా నుంచి ఆయన పేరు తొలగించారు.
రఘురామకృష్ణరాజును ఏమీ చేయలేక… ఆయనను.. ఆయన పేరును.. తమ రికార్డుల నుంచి తొలగించుకున్నారా లేకపోతే.. స్పీకర్ ఓ బిర్లా… తమ విజ్ఞప్తిని ఆమోదిస్తారని… అనర్హతా వేటు వేస్తారన్న కారణంగా ముందుగానే తొలగించారాఅన్నదానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ… రఘురామపై… వారంలో నిర్ణయం తీసుకోక పోతే.. ఆ తర్వాత తీసుకుంటారన్నదానిపైనా స్పష్టత ఉండే అవకాశం లేదు. ఇదే చివరి ప్రయత్నమన్నట్లుగా వైసీపీ ప్రయత్నించింది. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం… తాను ఏ పార్టీలో చేరలేదన్న విషయాన్ని గుర్తు చేసి… రూల్స్ప్రకారం.. తన పై అనర్హతా వేటు సాధ్యం కాదని అంటున్నారు.