రాఫెల్ స్కాం గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనతో.. ఇప్పుడు.. ఎంత పెద్ద స్కాం జరిగిందనే దానిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందరూ బోఫోర్స్‌తో పోలుస్తున్నారు. కానీ బోఫోర్స్ స్కాం రూ. 64 కోట్ల కుంభకోణం. కానీ.. రాఫెల్ ఒప్పందంతో… ప్రభుత్వ రంగ సంస్థ అయిన.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీని పక్కన పెట్టడం ద్వారా అనిల్ అంబానీ కంపెనీకి దాదాపుగా రూ. 30 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. రూ. 64 కోట్ల కుంభణంతో పోలిస్తే.. ఇది వెయ్యి బోఫోర్స్ల రెట్టింపు స్కాం.
అంబానీ కోసమే కొత్త ఒప్పందమా..?
రక్షణ రంగానికి సంబంధించి.. ఏమికొన్నా.. దానికో క్లాజ్ ఉంటుంది. అదేమిటంటే.. విదేశాల నుంచి ఏమి కొన్నా యాభై శాతం.. భారతీయ పార్టనర్ షిప్ కంపెనీలతో తయారు చేయాలనేది ఆ క్లాజ్. దీని వల్ల ఏమిటంటే… ఇండియాలో రక్షణ పరికరాల కంపెనీలు అభివృద్ధి చెందుతాయి. రాఫెల్ డీల్‌లో … డీల్ కుదుర్చుకుంటున్న కంపెనీ ఇండియన్ పార్టనర్‌ను తెచ్చుకోవాలి. యూపీఏ హయాంలో.. జరిగిన చర్చల్లో ఇండియన్ పార్టనర్‌గా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను… ఉంచారు. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ కంపెనీ అయిన హెచ్ఏఎల్ను తొలగించి.. రిలయన్స్ డిఫెన్స్‌కు చోటు కల్పించారు. ఫిబ్రవరి 2015లో అనిల్ అంబాని కంపెనీని ప్రారంభించారు. ఏప్రిల్‌లో… మోడీ ఫ్రాన్స్‌కు వెళ్లి పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని అంబానితో పాటు వెళ్లిన బృందంలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మార్చి 25న చర్చలన్నీ పూర్తయ్యాయని కంపెనీ చెప్పింది. మూడు రోజులకు అనిల్ అంబానీ కొత్త కంపెనీ పెట్టారు. తర్వాత రెండు వారాల్లోపే.. పాత ఒప్పందం రద్దు చేసి.. హెచ్ఏఎల్ను తొలగించి… అనిల్ అంబానీ..కంపెనీకి భాగస్వామిగా చేర్చారు. దస్సాల్ట్ కంపెనీ ఇండియన్ పార్టనర్‌గా అనిల్ అంబానీని ఎంచుకుంది. ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు.
అంబానీ కంపెనీని కేంద్రమే సిఫార్సు చేసిందన్న అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు..!
ఫ్రాన్స్‌లో ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో… ప్రధాని మోదీతో పాటు.. అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ కూడా ఉన్నారు. ఇప్పుడు హోలండ్.. ఏం ప్రకటించారంటే..ఇండియన్ పార్టనర్ కంపెనీని ఎంపిక చేయడంలో తమకేమీ సంబంధం లేదంటున్నారు. హెచ్ఏఎల్ను తీసేసి.. రిలయన్స్‌ను.. భాగస్వామిగా చేర్చుకోమని ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఇది ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధం. నిజానికి మోడీ ఒప్పందం రద్దు చేయాడానికి పదిహేను రోజులు ముందు దస్సాల్ట్ కంపెనీ ప్రతినిధితో పాటు.. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి కూడా మీడియాతో మాట్లాడి.. ఇక సంతకాలు చేయడమే మిగిలి ఉందని చెప్పారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సామర్థ్యాన్ని పొగిడారు కూడా. కానీ ఆకస్మాత్తుగా.. ఆ తరవాత పదిహేను రోజులకే ఒప్పందాన్ని రద్దు చేశారు. కొత్త ఒప్పందం చేసుకున్నారు. మోడీతో పాటు ప్రతినిధి బృందంలో భాగంగా అనిల్ అంబానీ వెళ్లినప్పుడే ఈ ఒప్పందం జరిగింది. హెచ్ఏఎల్ కన్నా.. అనిల్ అంబానీ కంపెనీ పెద్దదా..? సమర్థవంతమైనదా..?
అంబానీ కంపెనీకి రూ. 30 వేల కోట్ల ఆదాయం..!
అప్పుల పాలై, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న కంపెనీ అనిల్ అంబానీ కంపెనీ. 2G స్కాంలో .. ఆ కంపెనీకి చెందిన వాళ్లు జైళ్లలో ఉన్నారు. భారతీయ బ్యాంకులకు రెండు లక్షల కోట్ల మేర అప్పు ఉన్నారు. యుద్ధ విమానాలు కాదు.. సబ్బులు కూడా అనిల్ కంపెనీ తయారు చేయలేదు. అనిల్ అంబానీ.. ఒక్క కంపెనీని కూడా సమర్థవంతంగా నడిపించలేదు. తేజస్ లాంటి యుద్ధ విమానాల్ని తయారు చేసిన కంపెనీని వదిలేసి.. అసలు ఏమీ లేని.. చేతకాని కంపెనీని నెత్తిమీద పెట్టుకుంటారా ఎవరైనా..? ఇవన్నీ చూస్తూంటే.. అనిల్ అంబానీ కోసమే.. రాఫెల్ డీల్‌ను మార్చి ఒప్పందం చేసుకున్నారని స్ఫష్టంగా ప్రకటించారు. కనీసం రూ. 30 కోట్లు అనిల్ అంబానీకి లాభం వస్తుందన్నమాట. అంటే.. అనిల్ అంబానీ కోసం.. హెచ్ఏఎల్ను పక్కన పెట్టింది.
విమానం ధర 300 రెట్లు ఎలా పెరిగింది..?
యూపీఏ హయాంలో చేసుకున్న ఒప్పందంలో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఉంది. కానీ కొత్త ఒప్పందంలో దాన్ని తీసేశారు. ఇది దస్సాల్ట్ కంపెనీకి లాభం చేకూర్చారు. ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడేం జరిగిందంటే.. ఈ క్లాజ్ తీసేస్తాం.. మేం చెప్పిన కంపెనీని ఒప్పందంలో చేర్చుకోమని లాబీయింగ్ జరిగింది. భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని తాకట్టు పెట్టి…అనిల్ అంబానీకి లాభం చేకూర్చారు. దీనికి దస్సాల్ట్ కంపెనీ.. సంతోషంగా ఒప్పుకుంది. మోడీ కొత్తగా చేసుకున్న ఒప్పందంలో ఒక్కో యుద్ద విమానం ధరను 24.30 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. అంటే.. గత ఒప్పందంతో పోలిస్తే ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో విమానానికి మూడు వందల శాతం అధిక ధర చెల్లించాలని నిర్ణయించారు. మూడేండ్లలోనే ఇంతగా ధరల్లో తేడా ఎలా వచ్చింది..? యూపీఏ ఒప్పందం ప్రకారం విమానాల తయారీ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడానికి దస్సాల్ట్ అంగీకరించింది. తాజా ఒప్పందంలో అందుకు అవకాశమివ్వలేదు. మోడీ చేసుకున్న ఒప్పందాన్నే మోడీ ఉల్లంఘించారు.
అత్యంత గోప్యంగా జరిగిన కుంభకోణమా..?
మార్చి 25 2015లో దస్సాల్ట్ సీఈవో సంతకాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఈ విషయం ఫారిన్ సెక్రటరీకి తెలియదు. వారం రోజుల ముందు వరకు.. రక్షణ మంత్రికి కూడా తెలియదు. ఎందుకంటే.. అప్పటి రక్షణ మంత్రి.. ఒప్పందానికి వారం రోజుల ముందు కూడా.. హెచ్ఏఎల్తో ఒప్పందం ఉంటుందని మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంపై పారిస్‌లో ప్రధాని మోడీ సంతకం చేయడానికి రెండురోజుల ముందు భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్యర్య పరిచింది. ఈ ఒప్పందం నుంచి హెచ్ఏఎల్ను తప్పిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భారత్‌లోని ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నదే ప్రశ్న..? మొత్తంగా చూస్తే.. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న భారత ప్రయోజనాలను కపాడే.. క్లాజులన్నింటినీ తొలగించి… ప్రైవేటు కంపెనీకి లాభం కలిగేలా.. ఒప్పందం చేసుకున్నారు. అంటే.. స్కాం జరిగిందని.. స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది.