గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తీస్తామని చెప్పిన రాఘన కన్ స్ట్రక్షన్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ప్రభుత్వం మారే సమయానికి అంటే మే సయమానికి రూ. యాభై కోట్ల రూపాయల పనులు చేశామని బిల్లులు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే డ్రెడ్జింగ్ చేసిన సూచనలేమీ కనిపించలేదు. కనీసం అక్కడ యంత్రాలు కూడా లేవు. డ్రెడ్జింగ్ చేసిన ఇసుక ఏదంటే.. పక్కన గుట్టలుగా పోశాం తీసుకెళ్లిపోయారని చెబుతున్నారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాకంతో ఉన్నతాధికారులు వరుసగా నోటీసులు జారీ చేసి .. అసలు డ్రెడ్జింగ్ చేశారన్న దానికి .. పనులు చేశారన్నదానికి సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారు. ఆ కంపెనీ బిల్లులు పెట్టుకున్న సమయంలో చెప్పినట్లుగా డ్రెడ్జర్లు, యంత్ర పరికాలు, ఇతర సామాగ్రి కాటన్ బ్యారేజీ వద్దకు వచ్చినట్లుగా పని చేసినట్లుగా రికార్డు చూపాలని కోరితే చూపడం లేదు. ఆగస్టు వరకూ అసలు ఎలాంటి యంత్రాలు రాలేదని కాటన్ బ్యారేజీ నిర్వహణ చూసే ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీనిపై పొంగులేటి కంపెనీపై విచారణకు సిద్ధమయ్యారు.
అసలు డ్రెడ్జింగ్ విషయంలో రాఘవ కంపెనీకి అనుభవం లేదు. టెండర్లు ఆ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేయడానికి అధికారులు భయ.పడి సెలవు పెట్టిపోతే.. ఈఎన్సీగా ఉన్న నారాయణరెడ్డి అనే అధికారి తనకుతానే ఇంచార్జ్ గా ప్రకటించుకుని కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇప్పుడీ ఒప్పందం నుంచి విచారణ చేస్తున్నారు. ఏపీని అడ్డగోలుగా దోచుకున్న కంపెనీల్లో ఒకటిగా పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీలు నిలిచాయి. వాటిపై ఎన్నో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి.