ప్రతీ హీరో తన మార్కెట్ ని పెంచుకొనే పనిలో అహర్నిశలూ శ్రమిస్తున్నాడు. సినిమా సినిమాకీ క్వాలిటీ మేకింగ్ పెరుగుతోంది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న తపన ఎక్కువవుతోంది. దాంతో బడ్జెట్లూ పెరుగుతున్నాయి. ఇప్పుడు లారెన్స్ సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. ఇది ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్.
లారెన్స్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఏ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు లారెన్స్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, టైటిల్ నీ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘కాలభైరవ’ అనే పేరు ఖరారు చేశారు. ఇదో సోషియో ఫాంటసీ సినిమా. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ గా నడుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉంది. టెక్నికల్‌గా భారీ స్థాయిలో ఉండబోతోంది. బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషించబోతున్నట్టు టాక్. ఈ సినిమా కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 2025 సంక్రాంతికి షూటింగ్ మొదలవుతుంది. 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా స్క్రిప్టు కోసం లారెన్స్, రమేష్ వర్మ యేడాది నుంచీ కష్టపడుతున్నారు. లారెన్స్ – రమేష్ వర్మ కాంబోలో ‘కిల్’ రీమేక్ వస్తుందని ప్రచారం జరిగింది. కాలభైరవకే యేడాదిన్నర వెచ్చిస్తే… ‘కిల్’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది పెద్ద ప్రశ్న. బహుశా.. లారెన్స్ స్థానంలో మరో హీరో ఉండొచ్చేమో..?!