వెబ్ సిరీస్‌కి ఇప్పుడు మార్కెట్ బాగుంది. అమేజాన్, నెట్క్లిఫ్స్ లాంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. అందుకే…. టాలీవుడ్ స్టార్లు కూడా ఇటువైపుగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు కూడా వెబ్ సిరీస్ మొదలెట్టబోతున్నట్టు టాక్. రియయన్స్ సంస్థతో కలసి దర్శకేంద్రుడు ఓ వెబ్ సిరీస్ మొదలెట్టనున్నార్ట. ఈ వెబ్ సిరీస్‌కి ఆయన దర్శకత్వం వహిస్తారా? లేదంటే ఆయన శిష్యుడికి బాధ్యత అప్పగించి – ఆయన దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా? అన్నది తెలియాల్సివుంది. ఇటీవల రాఘవేంద్రరావు మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారని, త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని తెలిసింది. రాఘవేంద్రుడు వెబ్‌సిరీస్ పనుల్లో బిజీగా ఉన్నారని, ఆయన తీస్తోంది సినిమా కాదని.. విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.