హైద్రాబాద్ ని ఈ రోజు భారీ వాన ముంచేసింది. సాయింత్రం ఎడతెరిపి లేకుండా రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే వుంది. వర్షం ధాటికి హైదరాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ జామ్. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని వాహన దారులు నానా పాట్లు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా బలయ్యాడు. పంజా గుట్ట ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంట సేపు ఆయన వాహనం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఇక ముందుకు కదిలే వీలు లేకపోవడం తో రాఘవేంద్ర రావు కారు దిగి… ఆ వర్షం లో నడుచుకుంటూ వెళ్లిపోయారట. దారిలో రాఘవేంద్రరావు ని గుర్తుపట్టిన కొందరు లిఫ్ట్ ఆఫర్ చేశారు కూడా. చివరికి ఓ బైక్ ని ఆపి లిఫ్ట్ అడిగి.. సినీ మాక్స్ లోని తన ఆఫీస్ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇంత హడావిడిలోనూ కొంతమంది ఫోటోల కోసం వెంట పడడం విశేషం. మొత్తానికి హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లో ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో దర్శకేంద్రుడికి తెలిసొచ్చిందన్న మాట.