ఈమధ్య రాఘవేంద్రరావుకి నటనపై దృష్టి మళ్లింది. `పెళ్లి సందడి`లో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాదు.. హీరోగానూ ఓ సినిమా చేస్తున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్క్రిప్టు ఎప్పుడో సిద్ధమైంది. షూటింగ్ కి వెళ్లడమే తరువాయి. ఇందులో నలుగురు అగ్ర కథానాయికలు సైతం కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు తెలియాల్సివుంది.
అయితే.. ఇప్పుడు దర్శకేంద్రుడు హీరోగా మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రానికి వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. కథ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తనికెళ్ల భరణి సినిమా పూర్తయ్యాకే.. ఆదిత్య కథ మొదలవుతుందని టాక్. ఈలోగా దర్శకేంద్రుడు మెగాఫోన్ కూడా పట్టబోతున్నారని సమాచారం అందుతోంది. ఆయన `ఓం నమో వెంకటేశ` తరవాత మరో సినిమా చేయలేదు. నమో వెంకటేశ తరవాత దర్శకేంద్రుడు రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన నటుడైపోయారు. ఇప్పుడు మెగాఫోన్ కూడా పట్టుకుంటారని సమాచారం. త్వరలోనే ఆ వివరాలూ తెలుస్తాయి.