పౌరాణిక చిత్రాలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో… పౌరాణిక గాథల్ని మరింత గొప్పగా తెరకెక్కించవచ్చని రూపకర్తలు భావిస్తున్నారు. `మహాభారతం`ని మళ్లీ తీయాలన్నది రాజమౌళి ప్రయత్నం. ఈలోగా ఆయన గురువు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు `రామాయణం` తీయాలని నిర్ణయించుకున్నారు. `ఓం నమో వెంకటేశాయ` తరవాత రాఘవేంద్రరావు మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు జరగుతోంది. `రాయామణం` గాథని చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. భారీ హంగులతో, స్టార్ నటీనటులతో ఈ కథని చూపించాలని భావిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకూ వెండి తెరపై రామాయణ గాథని చాలాసార్లు చూసేశారు ప్రేక్షకులు. అయితే ఇందులో మాత్రం రామాయణం ని ఓ కొత్త పద్ధతిలో ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులన్నీ పార్ట్ 1, పార్ట్ 2లుగా తీస్తున్నారు. `రామాయణం` కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.