సెంచరీ సినిమాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు. `నమో వెంకటేశ` తరవాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. `పెళ్లి సందడి 2` చేస్తున్నా, ఆయనది కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే. తాజాగా ఆయన కెమెరా ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులోనూ హీరోగా. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ సినిమాలో నటించడానికి రాఘవేంద్రరావు ఓకే చెప్పారని సమాచారం.
ప్రధాన నాయకుడు పాత్రే అయినా.. కె.రాఘవేంద్రరావు స్థాయికి తగ్గట్టుగా ఆ పాత్ర హుందాగా ఉండబోతందని తెలుస్తోంది. `పింక్`, `చీనీకమ్`, `బ్లాక్` చిత్రాల్లో కథానాయకుడి పాత్ర ఎంత ఉదాత్తంగా ఉంటుందో.. అలానే ఈ సినిమాలోనూ రాఘవేంద్రరావు పాత్ర ఆ స్థాయిలో ఉంటుందని, అందుకే దర్శకేంద్రుడు కూడా ఈ కథకు ఓకే చెప్పారని సమాచారం. `మిథునం` తరవాత తనికెళ్ల భరణి మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. `మిథునం` లానే ఈ కథ కూడా చాలా హృద్యంగా సాగబోతోందని వచ్చే యేడాది ప్రధమార్థంలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోందని టాక్.