‘నమో వేంకటేశ’.. రాఘవేంద్రరావు ఆఖరి చిత్రం. ఆ తరవాత ఆయన మెగాఫోన్ పట్టలేదు. సినిమాలపై అంతగా ఆసక్తీ చూపించలేదు. కాకపోతే.. ఇప్పుడు మళ్లీ ఓ సినిమా చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నట్టు టాక్. ఆయన కామ్‌గా ఉన్నా.. కీరవాణి, సత్యానంద్లాంటి మిత్రులు రాఘవేంద్రరావుతో ఓ హిట్టు సినిమా తీయించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే దర్శకేంద్రుడు కూడా మనసుని సినిమాలవైపు లగ్నం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దర్శకేంద్రుడు కథల వేటలో ఉన్నారు. యువ రచయితల దగ్గరనుంచి సీనియర్ రైటర్ల వరకూ ఆయనకు కథలు వినిపిస్తున్నారు. ఇటీవలే బివిఎస్ఎన్ రవి దర్శకేంద్రుడికి ఓ కథ చెప్పారు. ఆల్రెడీ రాఘవేంద్ర రావు దగ్గర ‘పెళ్లి సందడి’ టైపులో ఓ కథ ఉంది. దర్శకేంద్రుడి మార్క్ నూటిని నూరుపాళ్లూ ఆవిష్కరించే సినిమా అది. అలాంటి సినిమాతో తన కెరీర్‌కి శుభం కార్డు పడాలని ఆయన భావిస్తున్నారు. దానికి మించి ఏమైనా కథ దొరుకుతుందా? అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. పూర్తిగా కొత్త నటీనటులతో ఈ సినిమాతెరకెక్కించాలన్నది ఆయన ఆలోచన. కథ ఓకే అవ్వగానే.. ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది.