ఎన్టీఆర్ బయోపిక్‌కి కోసం తొలిసారి బాలకృష్ణ కెప్టెన్ కుర్చీలో కూర్చోవడానికి డిసైడ్ అయిపోయినట్టే. చివరి ప్రయత్నంగా ఈరోజు ఆయన.. కె.రాఘవేంద్రరావుని కలుసుకున్నట్టు సమాచారం. ‘ఈ సినిమా మీరు చేయొచ్చు కదా’ అని రాఘవేంద్రరావుని మరోసారి అడిగార్ట బాలయ్య. కానీ రాఘవేంద్రరావు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే ‘దర్శకత్వ పర్వవేక్షకుడు’గా ఉండడానికి రాఘవేంద్రరావు అంగీకరించినట్టు తెలుస్తోంది. బాలయ్యకు నటుడిగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. దర్శకత్వ బాధ్యతలు ఎలాంటివో ఆయనకు తెలియంది కాదు. అందుకే ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన ధైర్యం చేస్తున్నారు. దర్శకుడిగా బాలయ్యకు దర్శకేంద్రుడు సలహాలూ, సూచనలు ఇస్తారన్నమాట. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల విషయంలో మీ సలహాలు కావాలని బాలయ్యే రాఘవేంద్రరావుని అడిగినట్టు సమాచాంర. దానికి రాఘవేంద్రరావు కూడా అంగీకరించారని తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’కి రాఘేవేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నారు. `పల్లకిలో పెళ్లికూతురు`కీ ఇలాంటి బాధ్యతే చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఆ పాత్ర పోషించబోతున్నారన్నమాట.