రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సినిమా పెళ్లి సందడి. విడుదల రోజున ఫ్లాప్ టాక్ వచ్చినా, ఈ సినిమా ఆ తరవాత పుంజుకుంది. బాక్సాఫీసు దగ్గర రూ.10 కోట్లు సాధించి, ఘనమైన లాభాలు ఆర్జించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మలేదు. రిలీజ్ కి ముందు రూ.2 కోట్లకు కొనుక్కోవడానికి కొన్ని ఓటీటీ సంస్థలు వచ్చాయి. అయితే ఈసినిమాపై నమ్మకంతో అప్పుడు ఓటీటీ రైట్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడు ఓటీటీ రైట్స్‌ని జీ 5కి ఇచ్చేశారు. ఓటీటీ, శాటిలైట్ రెండూ కలిపి దాదాపుగా 7 కోట్లకు అమ్మినట్టు టాక్. నిజంగా ఇది జాక్ పాక్ లాంటి రేటే. రిలీజ్‌కి ముందు అమ్మితే, రెండు కోట్లతో సర్దుకోవాల్సివచ్చేది. ఇప్పుడు ఏకంగా 7 కోట్లు వచ్చాయి. ఎప్పుడో దసరాకి రిలీజ్ అయిన సినిమా ఇది. చిన్న సినిమాలు 15 రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ పెళ్లి సందడి లేట్ అయ్యింది. ఇప్పుడు ఎలాగూ బేరం కుదిరిపోయింది కాబట్టి, త్వరలోనే ఈ సినిమాని ఓటీటీలో చూసేయొచ్చు.