ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలా వ్యవహరిస్తున్నారా..? అంటే.. అవునని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడే పరిస్థితి తలెత్తింది. బీజేపీపై పోరాటానికి.. చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి.. రఘువీరారెడ్డి.. డుమ్మా కొట్టడమే కాదు.. చంద్రబాబుపై విమర్శలు చేయడంతోనే.. ఆయన ఎజెండా ఏమిటో క్లారిటీ వచ్చిందంటున్నారు.
అఖిలపక్షంపై వైసీపీనే ఫాలో అయిన రఘువీరా..!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు.. ప్రత్యేకహోదా రాజకీయ అంశం. ఈ అంశంపైనే ఎన్నికలు జరిగనున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్. ఈ అడ్వాంటేజ్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు ఎలా ఉపయోగించుకోవాలి..? ఎలాంటి దూకుడుతో ప్రజల్లోకి వెళ్లాలి…?. సాధారణం ఎవరైనా.. దీన్ని అవకాశంగా భావిస్తారు. కానీ.. ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అదో మనస్‌గా అంచనా వేసుకుటున్నారు. తమ పార్టీ బలపడటం ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు ప్రత్యేకహోదా అంశంపై… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడేందుకు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీ వెళ్లడానికి నిరాకరించింది. కాంగ్రెస్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. దేశంలో .. బీజేపీపై పోరాటానికి… అందర్నీ ఏకం చేసి.. కాంగ్రెస్ పార్టీకి బలం కల్పించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తూంటే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ.. అదే బీజేపీపై పోరాటానికి.. టీడీపీతో కలసి వెళ్లకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బీజేపీపై పోరాటానికి టీడీపీతో కలసి వెళ్లడం నామోషీనా..?
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి…వారు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారా లేదా.. అన్న చర్చలు ఏపీలో ప్రారంభమయ్యాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన అఖిలపక్షానికి కాంగ్రెస్ హాజరయింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజనపై ఉండవల్లి చర్చకు పట్టుబట్టారు.. కానీ విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం కాదు. ఈ సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధులు.. విభజన హమీలు, ప్రత్యేకహోదా, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను ఎలా సాధించుకోవాలి అన్న అంశంపైనే ప్రభుత్వం పెట్టిన అఖిలపక్ష భేటీకి మాత్రం దూరం పాటించింది. బీజేపీపై పోరాడితే అంతిమంగా ఎవరికి లాభం కలుగుతుందన్న అంశం తెలియని రాజకీయ నేత రఘువీరా కాదు. విభజన హామీలు ఢిల్లీ స్థాయిలో హైలెట్ అయితే.. కాంగ్రెస్ కే లాభం కలుగుతుందని.. తెలియనంత… అమాయక రాజకీయ నేత కూడా కానే కాదు. అఖిలపక్షానికి హాజరైతే.. ఏపీ కాంగ్రెస్ నేతలకు వచ్చే నష్టమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ, జనసేన, వామపక్షాలు .. గైర్హాజర్ అయ్యాయంటే.. వాటికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉన్నాయి..?
వైసీపీపై ఎక్కడ లేని సానుభూతి పీసీసీ చీఫ్‌కి ఎందుకో.. ?
కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరా ఇంత కాలం పార్టీకి చేసిందేమీ లేదు. గతమెంతో ఘనమైన కాంగ్రెస్ పార్టీ అంధ్రప్రదేశ్ లో తుడిచి పెట్టుకుపోవడానికి విభజన ఒక్కటే కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం కూడా మరో కారణం. కాంగ్రెస్ లేదు అనే భావన కల్పించి.. కాంగ్రెస్ అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్సే అన్న ఫీలింగ్ కల్పించారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న అన్ని వర్గాలు వైసీపీకి మద్దతు తెలిపాయి. తమ మూలాలను ఎక్కడ కోల్పోయామో తెలిసి కూడా.. మళ్లీ తెచ్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ నేతలు చేయలేదు. కోల్పోయిన ఓటు బ్యాంక్ మళ్లీ రావాలంటే… వైసీపీని టార్గెట్ చేస్తేనే సాధ్యమని.. ఆ పనిలో ఉండమని చెప్పి పంపించారు. కానీ.. రాహుల్ గాంధీ ఆదేశాలను కూడా… ఏపీ పీసీసీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోగా… రివర్స్ లో .. టీడీపీపైనే విమర్శలు చేస్తోంది.
ఏపీలో వైసీపీతోనే కాంగ్రెస్ నేతలా..?
ఏపీ కాంగ్రెస్ ను నడిపిస్తున్న నేతలపై మొదటి నుంచి ఓ అభిప్రాయం ఉంది. వారు.. ప్రతిపక్ష పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అప్పట్లో.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీకి అన్యాయం చేసిన బీజే్పీని మళ్లీ కేంద్రంలో అధికారంలకి రాకుండా చేయాలంటే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాడాలనే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల కర్తవ్యం.. రాష్ట్ర స్థాయిలో అయినా.. టీడీపీతో కలిసి పోరాడటం. ఆ పని చేయడం లేదు. హస్తినలో మిత్రునిగా ఉంటున్న టీడీపీపైనే పోరాటం చేస్తున్నారు.