ఇక జగన్ గురించి మాట్లాడి వేస్ట్ అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తేల్చారు. భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన మంచో చెడో చేయాల్సింది చేశాడు వెళ్లిపోయాడు ఇక ఆయన గురించి పట్టించుకోవడం సమయం వృధా అన్నారు. ఇప్పుడు ప్రజలు తమకు బాధ్యత ఇచ్చారని.. వాటిని నిర్వర్తించాల్సి ఉందన్నారు. జగన్ ను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని .. దానికి సాక్ష్యంగానే అతి తక్కువ సీట్లు వచ్చాయన్నారు. ప్రజల దృష్టి ఇకపై తమ మీద ఉంటుందన్నారు.
తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ విషయంలో చట్ట ప్రకారమే అందరికీ శిక్షలు పడేలా చేస్తానని రఘురామ స్పష్టం చేశారు. కక్షలు తీర్చుకునేందుకు జనం మనకు అధికారం ఇవ్వలేదని బాధ్యత ఇచ్చారని చంద్రబాబు అన్నారని రఘురామ అంటన్నారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదన్నారు. అందుకే తాను గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశానని.. ఒకటి, రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుదని తెలిపారు. ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
మంత్రి పదవి రాకపోవడంపై రఘురామ నిరాశకు గురయ్యారు. మంత్రి పదవి అడిగితే తప్పేముందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే తమకు అన్ని ఓట్లు, సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. అందులో క్షత్రియుల పాత్ర కూడా ఉందన్నారు. క్షత్రియుల్లో ఎవరో ఒకరికి పదవి ఇస్తారన్న ఆశాభావాన్ని రఘురామ వ్యక్తం చేశారు.