వైసీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత రఘురామకృష్ణరాజు … సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారట. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అధినేత ఎన్నిక కోసం దాఖలవుతున్న నామినేషన్ల ప్రస్తావన రాగానే స్పందించారు. వైసీపీ అధ్యక్ష పదవికి ఎన్నిక పెడితే తాను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటీవలి కాలంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. నిర్వహించేందుకు కూడా ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు.
అయినప్పటికీ రఘురామకృష్ణరాజు తాను పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. గత ఏడాదే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించలేదని.. ఈ సారి నిర్వహిస్తారేమో చూడాలన్నారు. ఈ ఏడాది కూడా అయిపోయింది కాబట్టి వచ్చే ఏడాది నిర్వహిస్తే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ విధిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ కమిటీల ఎన్నికలను నిర్వహించాలి. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపాలి.
అందుకే ప్రతి రెండేళ్లకోసారి వివిధ రాజకీయ పార్టీలు ప్లీనరీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ప్లీనరీ కంటే ముందే పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేస్తారు. కానీ వైసీపీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. పెద్దగా సంస్థాగతఎన్నికలు జరుగుతున్న సందర్భాలే ఉండవు. అందుకే సెటైరిక్‌గా తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని నిరూపించడానికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘురామ చెప్పుకొచ్చారు.