ప్రతీ దానికి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపకుండా డిస్మిస్ చేసింది. అసలు ఆ పిటిషన్ దేనికోసమంటే రిషికొండలో అక్రమంగా తవ్వకాలు.. నిర్మాణాల అంశంపై . అయితే.. ఈ విషయం ఇంకా హాైకోర్టులో ఉందని న్యాయస్థానం కూడా మధ్యంతర ఆదేశాలు ఇచ్చినందున.. కావాలనుకుంటే మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు విచారణ పూర్తయిన తరువాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందంటూ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదన్నారు. రుషికొండపై నిర్మాణాలకు వెంటనే స్టే విధించాలని కోరారు. కాన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఇటీవల ఏపీ హైకోర్టులో రిషికొండపై విచారణ జరిగింది. ఇరవై ఎకరాల వరకూ తవ్వేశారన్న వచ్చిన ఆరోపణలో… సర్వే చేయించాలని హైకోర్టు నిర్ణయించింది. కేంద్ర శాఖలకు సర్వేకు ఆదేశించింది. ఈ సర్వే వివరాలు వచ్చిన తర్వాత రిషికొండపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. రఘురామకు ఆసక్తి ఉంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించే చాన్స్ ఉంది.