జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ జరపాలని ఏపీ హైకోర్టుకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు న్యాయవ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దాడి నేపధ్యంలోనే జస్టిస్ చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారణాలను ఆయన లేఖలో వివరించారు. కొద్ది రోజుల కిందట జస్టిస్ చంద్రు హిందూ దినపత్రికలో అమరావతిపై ఓ ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఉన్న వ్యాఖ్యలే అంతకు ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఒకరు చెప్పారని .. వాస్తవ విరుద్దంగా ఉన్న రెండూ ఒకే విధంగా ఉండటం యాధృచ్చికం కాదన్నారు.
ఆ ఎంపీ న్యాయవ్యవస్థకు ఉద్దేశాలు అపాదించి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా ఉన్నారని.. కానీ ఆయనపై ఇంత వరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. జస్టిస్ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు గౌరవనీయమైన వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రపై విచారణ జరిపి మొత్తం కుట్రదారుల్ని వెలికి తీయాలని ఆయన లే్ఖలో కోరారు. జస్టిస్ చంద్రు ఉద్దేశపూర్వకంగా హైకోర్టును నిందించినట్లుగా … ధర్మాసనం కూడా అభిప్రాయపడింది.
మానవ హక్కులపై ప్రసంగించాడనికి వచ్చి హైకోర్టు.. న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై మండపడింది. ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లే్ఖను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా.. లేకపోతే.. పక్కన పెడుతుందా అన్నది వేచి చూడాలి. ఒక వేళ జస్టిస్ చంద్రు వ్యవహారాన్ని కూడా కోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో కలిపితే సంచలనం అయ్యే అవకాశం ఉంది.