జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం వెల్లడి కావాల్సిన తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ బెంచ్‌ను మార్చాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంత వరకూ తీర్పును వాయిదా వేయాలన్నారు. దీనికి కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థల్లో తీర్పు గురించి ముందుగానే ప్రచారం జరగడాన్ని చూపించారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలు తీర్పును ప్రభావితం చేస్తున్నాయని అందుకే విచారణను ప్రత్యేక బెంచ్‌కు మార్చాలని కోరారు.
లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే తీర్పును బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాతే సీబీఐ కోర్టు తీర్పులను వెల్లడించే అవకాశం ఉంది.అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగనుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 25వ తేదీన తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు చెప్పింది.
అయితే ఆ రోజున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలతో సమయం ముగిసిపోవడం, తీర్పు కాపీ ఇంకా రెడీకాకపోవడంతో రెండు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించారు. అయితే ఆగస్టు 25వ తేదీన తీర్పు రాక ముందే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో ” పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి ” అని తీర్పును ప్రకటించారు. ఈ కారణంగా రఘురామకృష్ణరాజు తీర్పును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.