రఘురామకృష్ణరాజుపై ఏపీలో పలు చోట్ల అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌పై ఆయన అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారని పలు చోట్ల ఇతరులు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. చీరాలలో ఒకటి.. తూర్పుగోదావరి జిల్లాలో మరొకటి నమోదయ్యాయి. ఇంకెక్కడైనా నమోదయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. తాను సునీల్ కుమార్‌ను ఏమీ అనలేదని.. పైగా ఆయన కులం ఏమిటో కూడా తెలియదని.. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మండిపడ్డారు.
తనను విచారణ పేరుతో పిలిచి… హత్య చేసేందుకు కుట్ర పన్నారని.. తనకు సమాచారం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇందు కోసం జార్ఖండ్‌కు చెందిన ఓ ముఠాతో ఒప్పందం చేసుకున్నారని ఆయన అంటున్నారు. రాను రాను రఘఉరామకృష్ణరాజు.. వైసీపీ మధ్య వివాదం ముదిరిపోతోంది. రాజీనామా చేస్తానని రఘురామ ప్రకటించిన తర్వాత వైసీపీ ఎటాక్ మరింత తీవ్రమైనట్లుగా ఉందని ఆయన అనుమానిస్తున్నారు. సొంత నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటే.. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామన్న సంకేతాలు పంపడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.
రాను రాను రఘురమ.. ఈ వివాదాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఆయనపై కేసులు కూడా కావాలనే పెడుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదం ఎటుతిరుగుతుందో కానీ.. పరిస్థితి మాత్రం వైసీపీ వర్సెస్ రఘురామ అనే ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.